Sun Mar 08 2026 03:32:50 GMT+0530 (India Standard Time)
జోడో యాత్రకు బ్రేక్ : గుజరాత్ కు రాహుల్
భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ నేడు బ్రేక్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ నేడు బ్రేక్ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. గుజరాత్లోని సూరత్, రాజ్ కోట్ లలో జరిగే ర్యాలీ, బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత రాహుల్ ఇప్పటి వరకూ అక్కడ పర్యటించలేదు. ఆయన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతుంది. గుజరాత్ కు వెళ్లకుండానే ఆయన యాత్ర కాశ్మీర్ కు చేరుకుంటుంది.
బహిరంగ సభల్లో...
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తన పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి కూడా రాహుల్ దూరంగా ఉన్నారు. కానీ గుజరాత్ లో మాత్రం తొలిసారి రెండు సభల్లో ఆయన పాల్గొంటుండటం విశేషం. రాజ్కోట్, సూరత్ లలో జరిగే బహిరంగసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

