Sat Mar 07 2026 21:00:27 GMT+0530 (India Standard Time)
నేడు వాయనాడ్ కు రాహుల్, ప్రియాంక
నేడు వయనాడ్ లో రాహుల్ ప్రియాంకా గాంధీలు పర్యటించనున్నారు.

నేడు వయనాడ్ లో రాహుల్ ప్రియాంకా గాంధీలు పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో వారి పర్యటన సాగనుంది. నిన్ననే వారు వాయనాడ్ కు రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్నటి పర్యటనను రద్దు చేసుకున్నారు. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి రెండు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.
బాధితులకు పరామర్శ...
అనేక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా అస్సాం, పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని, వారంతా టీ తోటల్లో పనిచేసేందుకు వచ్చారని సమాచారం. ఆరు వందల మందికిపైగా జాడ కనిపించడం లేదు. దీంతో రాహుల్, ప్రియాంక నేడు వాయనాడ్ లో పర్యటించి బాధితులను ఓదార్చనున్నారు.
Next Story

