Sun Dec 14 2025 02:02:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయననను హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. కడుపులో ఇన్ఫెక్షన కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయనకు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య పరీక్షలు....
కాగా భగవంత్ మాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఆయన కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. భగవంత్ మాన్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు మాత్రం ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి విధుల్లోకి చేరాలని భావిస్తున్నారు.
Next Story

