Tue Mar 24 2026 12:24:57 GMT+0530 (India Standard Time)
ఎంపీగా పోటీ చేయనున్న రాబర్ట్ వాద్రా?
రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు

ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని రాబర్ట్ వాద్రా స్వయంగా వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మెురాదాబాద్ నుంచి పోటీ చేయాలని తనపై కాంగ్రెస్ నేతలు వత్తిడి తెస్తున్నారని రాబర్ట్ వాద్రా తెలిపారు.
కుటుంబ సభ్యులతో....
రాజకీయాల్లోకి రావాలని రాబర్ట్ వాద్రా నిర్ణయించుకున్నట్లే కనపడుతుంది. తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను రాజకీయాల ద్వారానే తిప్పికొట్టాలని భావిస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.
Next Story

