Tue Dec 30 2025 08:38:11 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంక ఇంట్లో పెళ్లి సందడి
ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా వివాహ నిశ్చితార్థం అయినట్లు వార్తలు వస్తున్నాయి

ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా వివాహ నిశ్చితార్థం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాను ప్రేమించిన యువతితోనే త్వరలో వివాహం జరగనున్నట్లు తెలిసింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తన స్నేహితురాలు అవీవా బేగ్ తో గత కొంతకాలంగా రేహన్ వాద్రా ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. ఆయన పెళ్లి ప్రపోజ్ చేయగానే అవీవా బేగ్ కూడా అంగీకరించడంతో ఇద్దరు తమ పెద్దల వద్ద తమ ప్రేమ గురించి చెప్పారట.
రేహాన్ వాద్రా వివాహ నిశ్చితార్థం...
అందుకు ఇరు కుటుంబాలు సమ్మతించడంతో వారి వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ గాంధీ కుటుంబం నుంచి అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు. అవీవాకుటుంబ సభ్యులు ఢిల్లీలో స్థిరపడిన వారు. పారిశ్రామికవేత్తలుగా ప్రసిద్ధి చెందిన వారు. అవీవీబేగ్, రేహన్ వాద్రా ఇద్దరూ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఇద్దరినీ ఒకటిని చేసిందని అంటున్నారు. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Next Story

