Sat Mar 21 2026 01:51:41 GMT+0530 (India Standard Time)
నేడు ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్టొననున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్టొననున్నారు. హజీనాపూర్ లో గంగా ఎక్స్ ప్రెస్ వే కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని వరసగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటనలు చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో...
ఇటీవల రెండు రోజుల పాటు వారణాసిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడు రోజులు గడవకముందే మరోసారి ఉత్తర్ ప్రదేశ్ పర్యటనకు మోదీ పర్యటనకు వెళుతున్నారు. ఉతర్ ప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తూ ప్రజల్లోకి వెళుతుంది.
Next Story

