Tue Jul 15 2025 17:25:39 GMT+0000 (Coordinated Universal Time)
28న తమిళనాడుకు ప్రధాని నరేంద్ మోదీ
ఈ నెల 28న ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నెల 28న ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.
వంతెన ప్రారంభోత్సవంలో...
వంతెన ప్రారంభోత్సవ ప్రాంతంలో వేదిక నిర్మాణ పనులకు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు. మోదీ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు పెద్దయెత్తున జన సమీకరణకు పార్టీ నేతలు వివిధ నియోజకవర్గాల నుంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story