Fri Dec 19 2025 19:13:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏడు నగరాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏడు నగరాలను సందర్శించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు రేపు మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలలో పర్యటించనున్నారు. రేపు తిరువనంతపురంలో తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ప్రయాణించే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం ఏడు నగరాలను ప్రధాని సందర్శించనున్నారు.
నిఘా బృందాలు...
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అన్ని నగరాల్లో 144వ సెక్షన్ విధిస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ పర్యటించే అన్ని ప్రాంతాల్లో నిఘాను విస్తృతం చేశారు.
Next Story

