Sat Dec 13 2025 22:35:13 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు రెండు రాష్ట్రాలకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి ప్రధాని వెళ్లనున్నారు. 11.30 గంటలకు శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకుని లక్ష కంఠ గీతాపారాయణం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. దాదాపు లక్ష మంది విద్యార్థులు, పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఉడిపి వీధుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు.
గోవాలో మఠానికి చేరుకుని...
మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేదేరి 3.15 గంటలకు గోవాకు చేరుకోనున్నారు. సౌత్ గోవాలోని కుశవతి నది ఒడ్డున ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. మఠం 550 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అనంతరం అత్యంత ఎత్తైన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. తర్వాత రామాయణ థీమ్ పార్క్ ను ప్రారంభించనున్నారు. ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేయనన్నారు.
Next Story

