Thu Mar 19 2026 13:27:33 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు ఒడిశాకు నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. మోదీ మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. మోదీ మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దేశంలో చివరిదశ ఎన్నికలు జూన్ 1వ తేదీతో ముగియనున్నాయి. ఇప్పటి వరకూ ఆరు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడు దశల్లో మొత్తం లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చివరి దశలో ఒడిశాలోనూ ఎన్నికలు కొన్ని నియోజకవర్గాల్లో జరగనున్నాయి.
మూడు సభల్లో...
దీంతో మోదీ నేడు ఒడిశాలో పర్యటిస్తున్నారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. మోదీ ఈ లోక్సభ ఎన్నికలకు విస్తృతంగా పర్యటించారు. అనేక రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని విజయం దిశగా పయనించేదిశగా ఆయన సభలు సాగాయి. ఒడిశా పర్యటన తర్వాత మోదీ నేరుగా కన్యాకుమారికి చేరుకుంటారని తెలిపారు. అక్కడ ధ్యానంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.
Next Story

