Sat Jun 21 2025 04:27:28 GMT+0000 (Coordinated Universal Time)
Modi : నేడు మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ
ఈరోజు మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. 7,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు

వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యం కాదు. అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్రాలను చుట్టి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు.
శంకుస్థాపనలు...
అందులో భాగంగా ఈరోజు మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. 7,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగియడంతో ఆయన రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈసారి 400 స్థానాలను సాధించే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగనున్నాయి.
Next Story