Fri Dec 19 2025 19:17:30 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కర్ణాటకలో మోదీ
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి పర్యటించనున్నారు. మొత్తం ఆరు రోజుల పాటు ప్రధాని పర్యటన సాగనుంది

కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి పర్యటించనున్నారు. మొత్తం ఆరు రోజుల పాటు ప్రధాని పర్యటన సాగనుంది. 22 ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆరు రోజుల పాటు పర్యటించనున్నారు. ఎలాగైనా వరసగా అధికారంలోకి బీజేపీని తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని పర్యటన సాగనుంది.
ఎన్నికల ప్రచారానికి...
ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల 8వ తేదీ వరకూ గడువు ఉంది. ప్రధాని మోదీ హుమ్నాబాద్, విజయపుర, బెంగళూరు, కోలార్, చెన్నపట్న, బెలూర్ నియోజకవర్గాల్లో మోదీ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోడ్ షోలు, ర్యాలీలలో మోదీ పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు తమ అధీనంలో తీసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాయి. మే 13వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
Next Story

