Thu Mar 27 2025 03:12:48 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా పోలీసుల భద్రత మధ్య మోదీ
నేడు గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మహిళా పోలీసుల భద్రతను కల్పిస్తున్నారు

నేడు గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను మోదీ జరుపుకోనుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నేడు గుజరాత్ లో...
అయితే మోదీ పాల్గొనే ఈ కార్యక్రమానికి పూర్తిగా మహిళా పోలీసుల భద్రతను కల్పిస్తుండటం విశేషం. మహిళ దినోత్సవం కావడంతో మహిళలే ప్రధాని భద్రత నిర్వహించనున్నారని అధికారులు వెల్లడించారు. దేశ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా మహిళా పోలీసులతో పహారా కాస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మహిళ పోలీసులు, భద్రతల మధ్య మోదీ గుజరాత్ లో పర్యటించనున్నారు.
Next Story