Sun Mar 08 2026 13:47:55 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు బీహార్ కు నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. నవాడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. బీహార్ లో అత్యధిక స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో వారంలో రెండోసారి ఆయన పర్యటన చేస్తున్నారు.
వారంలో రెండోసారి...
ఈ నెల 19వ తేదీన గయా, ఔరంగాబాద్, జాముయితో, నవాడా లోక్సభ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మరోసారి నేడు పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత మధ్య మోదీ ప్రధాని బీహార్ లో పాల్గొననున్నారు. ఈసారి బీహార్ లో జేడేయూతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
Next Story

