Fri Dec 05 2025 12:47:12 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అసోంలో పర్యటించనున్నారు. అసోంలో 18,530 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అసోంలో పర్యటించనున్నారు. అసోంలో 18,530 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆసాం రాష్ట్రంలోని దర్రాంగ్, గోలాఘాట్ జిల్లాలలో రూ.18,530 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
18,530 కోట్ల పనులకు ప్రారంభం...
మంగళదై పట్టణంలో దర్రాంగ్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎం స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వైద్య రంగ ప్రాజెక్టులకు రూ.570 కోట్ల పెట్టుబడి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, 2.9 కి.మీ. పొడవైన నరెంగి–కురువా వంతెన నిర్మాణానికి అంచనా వ్యయం రూ.1,200 కోట్లుగా చెప్పారు. మరియు 118.5 కి.మీ. పొడవైన గువాహటి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి ప్రాజెక్టు అసోంలోని కామ్రూప్, దర్రాంగ్ జిల్లాలను, మేఘాలయలోని రి భోయి జిల్లాను కలుపుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story

