Fri Dec 05 2025 18:26:32 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : ధ్యానంలో ఉన్నప్పుడు మోదీ వీటినే తీసుకుంటారట
ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో నలభై ఐదు గంటల పాటు ధ్యానం చేయనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో నలభై ఐదు గంటల పాటు ధ్యానం చేయనున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన ధ్యానం ప్రారంభించారు. అయితే ఆయన ధ్యానం సమయంలో ఆయన ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. కేవలం ద్రవాహారాలను మాత్రమే తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆహారం లేకుండా కేవలం కొబ్బరినీళ్లు, మంచినీళ్లను మాత్రమే స్వీకరిస్తూ మోదీ ధ్యానం చేస్తారు. కేవలం గొంతు ఆరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు మంచినీళ్లు తాగుతారని చెబుతున్నారు.
గత ఎన్నికలప్పుడు కూడా...
నిన్న సాయంత్రం 6.45 గంటలకు ఆయన ధ్యానంలోకి వెళ్లారు. రేపు ధ్యానాన్ని విరమిస్తారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానందస్వామి కూడా ఇక్కడే ధ్యానం చేశారని చెబుతున్నారు. నరేంద్ర మోదీ ఎన్నికలు ముగిసినప్పుడు ధ్యానంలోకి వెళ్లడం సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల ప్రచారం తర్వాత కేదార్నాధ్ లో ఆయన ధ్యానంనిర్వహించిన సంగతి తెలిసిందే. మోదీ ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరూ ఆయనను డిస్బ్రబ్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. చేపల వేటను కూడా మూడు రోజుల పాటు నిషేధించారు.
Next Story

