Mon Dec 15 2025 20:25:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్ణాటకకు ప్రధాని
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు - మైసూరు హైవేను ప్రారంభించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. మాండ్యా జిల్లాలో ఆయన పర్యటన సాగుతుంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు - మైసూరు హైవేను ప్రారంభించనున్నారు. పది లేన్లతో ఈ హేవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 118 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణం కోసం 8,480 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. మొత్తం పది లేన్లుగా ఈ రహదారి నిర్మించడతో బెంగళూరు - మైసూరు మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గింది.
మైసూరు - బెంగళూరు హైవేను...
ఎన్నాళ్లనుంచో మైసూరు - బెంగళూరు హైవేను నిర్మించాలన్న డిమాండ్ ఉంది. ఈరోజు ప్రధాని ఈ జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తరచూ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా కర్ణాటకలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

