Mon Mar 16 2026 20:22:42 GMT+0530 (India Standard Time)
నేడు కూడా రోడ్ షో
కర్ణాటకలో నేడు ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజులు కూడా రోడ్ షో నిర్వహించనున్నారు

కర్ణాటకలో నేడు ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజులు కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ రోడ్ షో నిర్వహించనున్నారు. నరేంద్ర మోదీ ఈరోజు బెంగళూరులో 10 కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహించనున్నారు. బెంగళూరులోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రధాని మోదీ రోడ్ షో వెళ్లనుంది.
పది కిలోమీటర్ల....
తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు ఉదయం 10గంటల నుంచి 11:30 గంటల మధ్య 10 కిలోమీటర్ల రోడ్‌షో జరగనుంది. ఈ రోడ్ షోలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. మే 10వ తేదీన ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని ఈరోజు రోడ్ షోలో పాల్గొని ప్రజలను బీజేపీ వైపునకు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

