Fri Dec 05 2025 19:37:28 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : మృత్యుంజయుడితో మాట్లాడిన మోదీ.. ఏం చెప్పారంటే?
అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ తో ప్రధాని చాలా సేపు మాట్లాడారు. 11A సీటులో కూర్చున్న ప్రాణాలతో రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న విమానయాన సిబ్బంది, ప్రయాణికులతో పాటు రమేష్ విశ్వాస్ కుమార్ ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రమేష్ విశ్వాస్ కుమార్ అక్కడి నుంచిబయటకు నడుచుకుంటూ వచ్చారు.
కోలుకుంటున్న...
రమేష్ విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అయితే ఆయనతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే పేలుడు శబ్దం వినిపించిందని, తాను సీటుతో సహా కింద పడిపోయాని, లేచి చూస్తే చుట్టు మృతదేహలు, మంటలు, విమాన శకలాలు ఉన్నాయని, తేరుకుని తనకు తాను నడుచుకుంటూ వచ్చానని ప్రధాని నరేంద్ర మోదీతో తో రమేష్ విశ్వాస్ కుమార్ చెప్పాడు. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన మోదీకి వివరించారు.
మధ్యలో కూర్చుని ఉన్న...
రమేష్ విశ్వాస్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా బ్రిటన్ లో ఉంటున్నారు. తాను కుటుంబసభ్యులను కలుసుకునేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో లండన్ కు బయలుదేరారు. మధ్య సీట్లో కూర్చున్న విమానంలో మధ్య సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో అతనితో పాటు ప్రయాణిస్తున్న సోదరుడు కనిపించడం లేదని రమేష్ విశ్వాస్ కుమార్ అందరినీ అడుగుతుండటం కలచి వేస్తుంది. ఈ ప్రమాదంలో రమేష్ విశ్వాస్ కుమార్ సోదరుడు మరణించారన్న సమాచారం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ఎక్కడైనా చికిత్స పొందుతున్నాడేమోనని రమేష్ విశ్వాస్ కుమార్ ఆరా తీయడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది.
Next Story

