Thu Mar 19 2026 00:46:49 GMT+0530 (India Standard Time)
Narendra Modi : మోదీ తొలి సంతకం.. 20 వేల కోట్ల నిధులు విడుదల
ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు

ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. సౌత్ బ్లాక్ లో ప్రధానిగా మూడోసారి బాధ్యతలను చేపట్టిన నరేంద్ర మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. 17వ విడత దేశంలోని రైతులకు పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఈ సంతకం చేశారు. మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు ఈ నిధులు అందనున్నాయి.
రైతుల సంక్షేమం కోసం...
ఇందుకోసం ఇరవై కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కానున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే తొలి సంతకం రైతులకు సంబంధించిన ఫైలుపైనే చేశానని, రానున్న రోజుల్లో మరింతగా రైతులకు అండగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు.
Next Story

