Thu Dec 18 2025 12:02:06 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : ఇవే వారికి చివరి ఎన్నికలు
ఈ ఎన్నికల ఫలితాలు కొత్త దిశను సూచిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

ఈ ఎన్నికల ఫలితాలు కొత్త దిశను సూచిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చివరి దశ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది ఎన్నోకలలు కంటూ వాగ్ధానాలు చేస్తున్నారని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అన్నారు.
మూడోసారి ఎన్డీఏ...
వారికి ఇవే చివరి ఎన్నికలవుతాయని కూడా మోదీ జోస్యం చెప్పారు. రిజర్వేషన్లపై దేశప్రజలను జాగృతం చేసేందుకే తాను మాట్లాడానన్న నరేంద్ర మోదీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను విపక్ష నేతలు చీకట్లో ఉంచాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా మూడోసారి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

