Tue Mar 17 2026 13:48:16 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ బట్టలిప్పేసిన మోదీ
వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించారు. మొన్న లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి మోదీ కౌంటర్ ఇచ్చారుక. కాంగ్రెస్ లేకుంటే ఎమెర్జెన్సీ వచ్చేది కాదన్నారు. మహాత్మాగాంధీ సయితం కాంగ్రెస్ పాలన చేపట్టాలని కోరుకోలేదని మోదీ అన్నారు. కాంగ్రెస్ మైండ్ సెట్ అర్బన్ నక్సలైట్ల మాదిరిగా ఉందన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
సిక్కుల ఊచకోతపై....
కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే సిక్కుల ఊచకోత జరిగేది కాదని మోదీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే హైదరాబాద్ దేశంలో విలీనం అయిందన్నారు. కాంగ్రెస్ వల్లనే ఈ దేశం అన్ని రకాలుగా నష్టపోయందని మోదీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఒక ముదు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే దేశం నష్టపోయిందని మోదీ అన్నారు. మోదీ ప్రసంగానికి నిరసనగా రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.
Next Story

