Mon Feb 10 2025 09:32:01 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ పై మోదీ సెటైర్లు విన్నారంటే.. నవ్వాపుకోలేరంతే
వికసిత్ భారత్ తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు చెప్పే కార్యక్రమంలో మాట్లాడారు

వికసిత్ భారత్ తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు చెప్పే కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పదేళ్ల తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని మోదీ తెలిపారు. ఐదేళ్లలో పన్నెండు కోట్ల మందికి తాగునీటి వసతి కల్పించామన్న మోదీ, నాలుగు కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్పై మోదీ సెటైర్లు వేశారు. కొందరు నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారన్నారు. పార్లమెంట్లో పేదలపై చర్చలో మాత్రం పాల్గొనరని అన్నారు. అలాంటి వారికి పేదల గురించి తెలియదన్నారు.
బూటకపు హామీలను...
తాము బూటకపు హామీలు ఇవ్వలేదన్న మోదీ పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామని చెప్పారు. డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత తీసుకొచ్చామన్న ఆయన స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామని నరేంద్ర మోదీ తెిపారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామన్న మోదీ తమ హయాంలో నలభై లక్షల కోట్లకు పైగా పేదలకు నేరుగా అందించామని తెలిపారు. 21వ శతాబ్దంలో 25 శాతం గడిచిపోయిందదన్న ఆయన మరోసారి దేశ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని మోదీ అన్నారు. దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు. పదేళ్లలో పేదల సమస్యలను గుర్తించడమే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించామని తెలిపారు.
Next Story