Wed Dec 17 2025 12:52:22 GMT+0000 (Coordinated Universal Time)
మన్మోహన్ పార్ధీవ దేహానికి మోదీ నివాళులు
మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు

మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆయన ఇంటికి వెళ్లి పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి చికిత్స పొందుతూ మరణించిన ఘటన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె అమెరికా నుంచి రావల్సి ఉండటంతో రేపు మన్మోహన్ సింగ్ పార్ధీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అనేక మంది నేతలు...
ప్రస్తుతం మన్మోహన్ నివాసంలోనే ఆయన పార్ధీవ దేహాన్నిఉంచారు. అనేక మంది ప్రముఖులు అక్కడకు వచ్చి నివాళులర్పిస్తున్నారు. మోదీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన తెచ్చిన సంస్కరణలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆర్థికవేత్తగా దేశానికి చేసిన మేలు గురించి ప్రస్తావిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

