Thu Jan 29 2026 23:25:03 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : కేరళలో నరేంద్రమోదీ.. భారీ సాయాన్ని ప్రకటిస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని వాయనాడ్ లో పర్యటిస్తున్నారు. ఆయన వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా చూశారు

ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని వాయనాడ్ లో పర్యటిస్తున్నారు. ఆయన వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా చూశారు. ఉదయం కన్నూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి సురేష్ గోపితో కలిసి ఆయన ఏరియల్ వ్యూ కి బయలుదేరి వెళ్లారు.
బాధితులతో మాట్లాడి...
తర్వాత ఆయన రెస్క్యూ టీంతో మాట్లాడి వాయనాడ్ లో సంభవించిన విలయానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. హెలికాప్టర్ నుంచి దిగి కాల్పెట్ట నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి అక్కడ ఆసుపత్రుల్లో ఉన్న బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న బాధితులను సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా కేరళ విలయానికి భారీ సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించే అవకాశాలున్నాయి.
Next Story

