Thu Mar 19 2026 16:43:43 GMT+0530 (India Standard Time)
ఇవాళ గుజరాత్ కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. వంతెన కూలిన ఘటన స్థలిని ఆయన సందర్శించనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. వంతెన కూలిన ఘటన స్థలిని ఆయన సందర్శించనున్నారు. మోర్బీలో వంతెన కూలి 141 మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా సహాయక బృందాలు జరుపుతున్నాయి. నదిలో బురద ఉండటంతో కొందరు అందులో కూరుకు పోయి ఉండవచ్చన్న అనుమానాలతో గాలింపు చర్యలను ఉధృతం చేశారు.
9 మంది అరెస్ట్...
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. 9 మందిని అరెస్ట్ చేసింది. అయితే ఈ విషాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియో కూడా ప్రకటించారు. అయితే స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించేందుకు ప్రధాని నేడు గుజరాత్ కు వెళ్లనున్నారు. ప్రమాద ఘటన జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
Next Story

