Sat Mar 21 2026 16:11:39 GMT+0530 (India Standard Time)
తల్లితో కలసి భోజనం చేసి?
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు పలు రోడ్ షోలలో పొల్గొననున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు పలు రోడ్ షోలలో పొల్గొననున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత గుజారత్ కు మోదీ ప్రత్యేకంగా వచ్చారు. త్వరలో గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించి పార్టీ నేతలతో పాటు ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు. రోడ్ షోలలో పాల్గొననున్నారు.
రెండో రోజు....
గుజరాత్ కు వచ్చిన మోదీ తన తల్లి హీరాబెన్ ను కలిశారు. ఆమెతో కలసి భోజనం చేశారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను గురించి విచారించారు. నేడు కూడా గుజరాత్ లో మోదీ పర్యటించనున్నారు. మోదీ వెంట హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.
Next Story

