Thu Mar 19 2026 07:37:07 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు బీహార్ కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాలు బీజేపీ సాధించాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళలో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు.
వరస పర్యటనలతో...
బీహార్ లో కూడా లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు సార్లు ప్రచారం నిర్వహించిన నరేంద్ర మోదీ నేడు మరొకసారి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గయా గాంధీ మైదానంలో మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ఆయన ప్రసంగించిన అనంతరం పూర్నియాలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Next Story

