Thu Dec 18 2025 17:59:06 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రాష్ట్రాలలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ నేడు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటిస్తారు

ప్రధాని నరేంద్రమోదీ నేడు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా మోదీ టూర్ సాగనుంది. పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కర్ణాటకలోని యాదగిరి, కలబురిగి జిల్లాలో ప్రధాని పర్యటిస్తారు. కొడెకలో సాటునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. యాదగిరి ప్రాంతంలోని గ్రామాల తాగునీటి సరఫరా పథకానికి ప్రధాని శంకుస్థాపన ేస్తారు. అలాగే 560 గ్రామాల్లోని మూడు లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా సాగునీటి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
మహారాష్ట్రలోనూ....
సాయంత్రం మహారాష్ట్ర బయలుదేరి వెళతారు. ఛత్రపతి మహారాజ్ టెర్మినస్ పునరాభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారు. 38,800 కోట్ల రూపాయల వ్యవయంతో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. ముంబై మెట్రోలో రెండు లైన్లను ఆయనను ప్రారంభించనున్నారు. ముంబయి మెట్రో రైల్ లైన్స్ ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ముంబయిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story

