Sun Mar 15 2026 15:03:43 GMT+0530 (India Standard Time)
Narendra Modi : కేరళలో ప్రధాని మోదీ రోడ్ షో
ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత దేశంపై ఫోకస్ పెట్టారు. గత నాలుగు రోజుల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత దేశంపై ఫోకస్ పెట్టారు. గత నాలుగు రోజుల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నిన్న తమిళనాడులో రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూనే నాలుగు వందల సీట్లు రావాలంటూ ప్రజలను కోరుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా...
ఈరోజు కూడా దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్ లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆయన రోడ్ షోలకు అనూహ్య స్పందన లభిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరస పర్యటనలతో ప్రధాని మోదీ దక్షిణాది భారతీయ జనతా పార్టీ నేతలు, క్యాడర్ లో జోష్ నింపుతున్నారు
Next Story

