Tue Mar 10 2026 21:36:50 GMT+0530 (India Standard Time)
Narendra Modi : అహ్మదాబాద్ లో ఓటు వేసిన మోదీ
అహ్మదాబాద్ లో ఓటు హక్కు ను ప్రధాని నరేంద్ర మోదీ వినియోగించుకున్నారు.

అహ్మదాబాద్ లో ఓటు హక్కు ను ప్రధాని నరేంద్ర మోదీ వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ వెళ్లి తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. దేశంలో మూడో దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. గుజరాత్ లో ఈరోజుతో పోలింగ్ ముగియనుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో ప్రజలు మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు.
అందరూ ఓటు వేసి...
ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ కూడా అనేక సంస్కరణలను తెచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య బలాన్ని కాపాడాలని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టవంతమైన ఎన్నికల ప్రక్రియ భారత్ లోనే జరుగుతుందని మోదీ తెలిపారు.
Next Story

