Fri Dec 05 2025 16:55:55 GMT+0000 (Coordinated Universal Time)
యోగా వేడుకల్లో మోదీ
ప్రధాని మోదీ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మైసూరు మహారాజ్ ప్యాలెస్ లో జరిగిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు.

కర్ణాటక వచ్చిన ప్రధాని మోదీ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మైసూరు మహారాజ్ ప్యాలెస్ లో జరిగిన యోగా డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్ణాటకలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ వచ్చారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే ఈరోజు యోగా దినోత్సవం కావడంతో తెల్లవారు జామున మైసూరు మహారాజ్ ప్యాలెస్ ప్రాంగణంలో జరిగిన యోగా వేడుకలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
అన్ని సమస్యలకు....
ఆయనతోపాటు కేంద్ర మంత్రి సోనోవాల్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా విశేషాలను ప్రధాని వివరించారు. మైసూరు ఆద్యాత్మానికి కేంద్రమన్నారు. ఈరోజుల్లో తమ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపచమంతా యోగా చేస్తున్నారని పేర్కన్నారు. యోగా ద్వారా మనసకు శాంతి కలగిస్తుందన్నారు. యోగా ప్రజలను, దేశాలను కలుపుతుందని మోదీ తెలిపారు. ఎన్నో సమస్యల పరిష్కారానికి దారి చూపిస్తుందని మోదీ అన్నారు.
Next Story

