Sat Mar 21 2026 00:13:19 GMT+0530 (India Standard Time)
నేడు యూపీకి మోదీ
ప్రధాని నరంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

ప్రధాని నరంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ లోని ఒక కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. యూపీలో ఎన్నిలక ప్రచారం ఊపందుకుంది. ఈనెల 10 తేదీన మొదటి విడత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. యూపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ యూపీలో ప్రధాని పర్యటనలను ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.
21 నియోజకవర్గాల ప్రజలను....
ప్రధాని మోదీ సయితం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే యూపీలో పర్యటిస్తూ వచ్చారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేశారు. మరోసారి యోగి ఆదిత్యానాధ్ కు అవకాశం ఇవ్వాలని మోదీ పదే పదే కోరుతున్నారు. మోదీ ఈ సభ ద్వారా 21 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వెయ్యి మందితో ర్యాలీ కూడా నిర్వహించనున్నారు.
Next Story

