Sun Mar 15 2026 16:56:30 GMT+0530 (India Standard Time)
మోదీ తల్లి హీరాబెన్ కు తీవ్ర అస్వస్థత
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో వెంటనే ఆమెను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
అహ్మదాబాద్ కు మోదీ...?
వందేళ్లు ఇటీవల పూర్తి చేసుకున్న హీరాబెన్ అస్వస్థతకు గురి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ బయలుదేరే అవకాశముందని తెలిసింది. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేసినట్లు సమాచారం. ఆయన వెళ్లి తల్లిని పరామర్శించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Next Story

