Wed Jan 22 2025 14:41:48 GMT+0000 (Coordinated Universal Time)
వాజపేయికి ఘన నివాళులు
భారత మాజీ ప్రధాని వాజపేయి నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ స్మారకం సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు
భారత మాజీ ప్రధాని వాజపేయి నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ స్మారకం సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. వాజపేయి దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వాజపేయికి నివాళులర్పించారు.
ప్రార్థనల్లో...
ఢిల్లీలో ఉన్న వాజపేయి స్మారకం సదైవ్ అటల్ కు వందల సంఖ్యలో బీజేపీ నేతలు తరలి వచ్చి నివాళులర్పించారు. వాజపేయి అందించిన సేవలను వారు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Next Story