Tue Nov 05 2024 18:35:55 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆయుష్మాన్ భారత్ కార్డు ఇలా పొందండి
డెబ్బయి ఏళ్లు పైపడిన వారందరికీ ఆయుష్మాన్ బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు
డెబ్బయి ఏళ్లు పైపడిన వారందరికీ ఆయుష్మాన్ బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారికి ఐదు లక్షల పరిమితితో అన్ని రకాల వైద్యసదుపాయం అందనుంది. ఉచితంగా ఆరోగ్యబీమా సదుపాయం పెద్దలకు అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ పథకాన్ని చేపట్టారు. అయితే దీనికి సంబంధించి దేశంలో ఉన్న ఆరు కోట్ల మంది 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏటా ఐదు లక్షల వరకూ ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు లబ్ది పొందనున్నారు.
దరఖాస్తుకు ఇలా...
అయితే ఈ పథకం కింద లబ్డి పొందాలంటే కొత్త కార్డును పొందాల్సి ఉంటుంది. వైద్య బీమా సౌకర్యం అందుకోవాలంటే ఆయుష్మాన్ భారత్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు 70 ఏళ్లు పైబడిన వారుంటే వారికి చెరి 2.50 లక్షల బీమా ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకాన్ని పొందాలంటే ముందుగా పీఎంజేఈవై పోర్టల్ మరియు ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకునే వీలుంది. పీఎంజేఏవై పోర్టల్ లో యామ్ ఐ ఎలిజిబుల్ ట్యాబ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుందిద. దీంతో beneficary.nha.gov.in అనే వెబ్ సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీ మొబైల్ నెంబరు, ఓటీపీ , వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేస్తే ఆమోదం కొంత వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆయుష్మాన్ కార్డు ఆమోదం పొందిన తర్వాత దానిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.
Next Story