Sun Mar 22 2026 20:03:20 GMT+0530 (India Standard Time)
మూడు రోజుల్లో ధరలు పెరుగుతాయ్
ఏప్రిల్ ఒకటి నుంచి కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువల ధరలు పెరగనున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువల ధరలు పెరగనున్నాయి. రెండు రోజుల్లో కొన్ని వస్తువల ధరలు పెరగనున్నాయి. బడ్జెట్ లో పెంచిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. బడ్జెట్లో సుంకాలు, పన్ను స్లాబు ల్లో కేంద్రం కొన్ని మార్పులు చేయడంతో కొన్నింటికి ధరలు పెరుగుతుండగా, మరికొన్నింటికి ధరలు తగ్గనున్నాయి.
పెరగనున్నవి.. తగ్గనున్నవి...
దేశీయ ప్రైవేటు జెట్స్, హెలికాప్టర్లు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండివస్తువులు, ప్లాటినం ఇమిటేషన్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు ధరలు పెరగనున్నాయి. దుస్తులు, వజ్రాలు, రంగు రాళ్లు , బొమ్మలు, సైకిళ్లు, టీవీలు , ఇంగువ, కాఫీ గింజలు , శీతలీకరించిన నత్తగుల్లలు, మొబైల్ ఫోన్లు , మొబైల్ ఫోన్ ఛార్జర్లు, కెమెరా లెన్స్‌లు భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ వాహనాలు, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు తగ్గనున్నాయి.
Next Story

