Sat Mar 21 2026 22:11:50 GMT+0530 (India Standard Time)
వావ్ గుడ్ న్యూస్... బంగారం ఈరోజు కూడా?
దేశంలో బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది. దాదాపు రూ.250 లు తగ్గడంతో బంగారం ప్రియులు కొనుగోలు చేసేందుకు మంచి అవకాశమంటున్నారు.

బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా భారతీయుల్లో బంగారం అంటే మక్కువ ఎక్కువ. బంగారం తమ వద్ద ఉండటం ప్రతిష్టాత్మకంగా భావించే వారు కొందరైతే, అత్యవసర సమయాల్లో బంగారం ఉపయోగపడుతుందన్నది మరికొందరి ఆలోచన. ఇలా బంగారం అంటే దాదాపు 70 శాతం మంది ప్రజలు ఇష్టపడతారని గతంలోనే పలు సర్వేలు తేల్చాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి.
హైదరాబాద్ లో....
తాజాగా దేశంలో బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది. దాదాపు రూ.250 లు తగ్గడంతో బంగారం ప్రియులు కొనుగోలు చేసేందుకు మంచి అవకాశమంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,900 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,990 రూపాయలుగా ఉంది.
Next Story

