Sat Mar 21 2026 20:53:28 GMT+0530 (India Standard Time)
బంగారం ధర పెరగలేదు.. గుడ్ న్యూసే గా మరి
బంగారం ధర ఈరోజు పెరగలేదు. స్థిరంగా ఉంది. సంక్రాంతి పండగకు మహిళలకు గుడ్ న్యూస్ లభించినట్లే.

బంగారం ధర ఈరోజు పెరగలేదు. స్థిరంగా ఉంది. సంక్రాంతి పండగకు మహిళలకు గుడ్ న్యూస్ లభించినట్లే. రెండు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. పండగ వేళ బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని పెట్టుబడిగా భావించే భారతీయులు తమ వద్ద కొద్దిపాటి నగదు ఉన్నా బంగారాన్ని కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతారు.
స్థిరంగా నేడు....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,000 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 69,900 రూపాయలుగా ఉంది.
Next Story

