Mon Mar 16 2026 01:07:56 GMT+0530 (India Standard Time)
ప్రముఖ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి మృతి
ప్రముఖ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి మరణించారు

ప్రముఖ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి మరణించారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. యామిని కృష్ణమూర్తి భరతనాట్యం, కూచిపూడి కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మదనపల్లిలో జన్మించి...
యామిని కృష్ణమూర్తి 1940లో మదనపల్లెలో జన్మించారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్వభూషణ్, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలతో సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా కూడా ఆమె వ్యవహరించారు. ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ను స్థాపించి ఎందరికో భరతనాట్యం, కూచిపూడి నేర్పించారు. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

