Sat Dec 13 2025 22:42:23 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఎన్నింటి కంటే?
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది.సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు, జార్ఖండ్ లో రెండో విడతగా 38 స్థానాలకు పోలింగ్ నేడు జరగనుంది. అయితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకూ నిజమవుతాయన్నది పక్కన పెడితే కొంత వరకూ క్లారిటీ వస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
సాయంత్రం 6.30 గంటలకు...
ఈరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. జాతీయ మీడియా సంస్థలు ఈ మేరకు ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని క్రోడీకరించి ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం రాజకీయంగానే కాదు అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23వ తేదీన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
Next Story

