Wed Jan 28 2026 23:49:17 GMT+0000 (Coordinated Universal Time)
Rajasthan : రాజస్థాన్ లో ప్రారంభమైన పోలింగ్.. ఒక్క స్థానం మినహా
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది. రాజస్థాన్ శానససభలో మొత్తం 200 స్థానాలుండగా ఈరోజు 199 స్థానాలకు పోలింగ్ ను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కరణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మరణించడంతో పోలింగ్ ను నిలిపేశారు. దీంతో ఇక్కడ ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ బందోబస్తు...
మొత్తం 199 శాసనసభ స్థానాల్లో 1,862 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. మొత్తం 5,25,38,105 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 36,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏడు గంటల వరకూ క్యూ లైన్ లో ఉన్న వారందరికీ పోలింగ్ కు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
Next Story

