Sun Mar 15 2026 12:33:03 GMT+0530 (India Standard Time)
నేడు యూపీలో ఆరో విడత ఎన్నికలు
ఉత్తర్ ప్రదేశ్ లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈరోజు మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది

ఉత్తర్ ప్రదేశ్ లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఈరోజు మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇప్పటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ఐదు విడతలుగా పోలింగ్ జరిగింది. మొత్తం 403 స్థానాలకు 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈరోజు పూర్వాంచల్ ప్రాంతంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
యోగి ఇలాకాలో....
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ పోటీ చేస్తున్న గొరఖ్పూర్ నియోజకవర్గానికి కూడా నేడు ఎన్నిక జరగనుంది. అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిద్దార్థ్ నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్ గంజ్, ఖుషీనగర్, దేవరియా, బలియా, గొరఖ్ పూర్ జిల్లాల్లో ఎన్నికలు నేడు జరగనున్నాయి. పది జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. ఉదయాన్నే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ గోరఖ్ నాధ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story

