Fri Dec 05 2025 09:01:46 GMT+0000 (Coordinated Universal Time)
మహిళతో మసాజ్ చేయించుకున్న పోలీస్ అధికారి.. వీడియో వైరల్ !
బీహార్ లోని సహర్సా ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో శశిభూషణ్ సిన్హా ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉన్న..

బీహార్ : ఇటీవల పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఒకరిని చూసి ఇంకొకరు మారాల్సిందల్లా పోయి.. మరింత ఎక్కువ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళతో పోలీసు ఉన్నతాధికారి మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఓ కేసులో జైలు పాలైన కుమారుడికి బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళతో పోలీసు అధికారి మసాజ్ చేయించుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్ లోని సహర్సా ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో శశిభూషణ్ సిన్హా ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉన్న సమయంలో సదరు మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కుమారుడు జైలులో ఉన్నాడంటూ తన గోడును తెలిపింది. తన వల్ల అయితే చేతనైన సాయం చేయాలి.. లేదా కుదరదు అని చెప్పాలి. కానీ ఆ పోలీసు అధికారి తన బుద్ధి చూపించాడు. రా నాకు మసాజ్ చేయి.. నీ కొడుకుకి బెయిల్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు.
ఒంటిపై చొక్కా తీసేసి మరీ.. మహిళతో మసాజ్ చేయించుకున్నాడు. తన అవసరం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళకు వేరే దారి లేక అతనికి మసాజ్ చేసింది. అదంతా స్టేషన్లో ఉన్న ఇతరులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వెంటనే ఇన్ స్పెక్టర్ శశిభూషణ్ సిన్హా ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story

