Fri Dec 05 2025 23:22:56 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో టెన్షన్.. టెన్షన్
ఉత్తర్ప్రదేశ్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ హత్యతో ఉద్రిక్తత నెలకొంది

ఉత్తర్ప్రదేశ్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గ్యాంగ్స్టర్, మాజీ పార్లమెంటు సభ్యుడు అతీక్ అహ్మద్ హత్యతో ఉద్రిక్తత నెలకొంది. ఆయన సోదరుడు అష్రఫ్ ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తీసుకెళుతున్న సమయంలో మగ్గురు విలేకర్ల ముసుగులో వచ్చి వారిపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు మరణించారని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.
ఘటనపై విచారణ...
అయితే కాల్పులకు సంబంధించిన దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈఘటన జరిగింది. హత్యలకు కారణం ఏంటో తెలియరాలేదు. ఇద్దరు హత్యకు గురికావడంతో ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ముగ్గురు సభ్యులతో కూడిన జుడియల్ కమిషన్ను విచారణ నిమిత్తం ఏర్పాటు చేశారు.
Next Story

