Wed Jan 07 2026 17:28:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ అరెస్ట్
డిజిటల్ పెట్టుబడి మోసం కేసులో ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు

డిజిటల్ పెట్టుబడి మోసం కేసులో ఫాల్కన్ ఎండీ అమర్ దీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ నుంచి రాగానే ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ పెట్టుబడుల పేరిట దాదాపు 850 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఫాల్కన్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ నుంచి సోమవారం రాత్రి ముంబై చేరుకున్న వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక ఇమిగ్రేషన్ అలర్ట్ ఆధారంగా ఈ అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముందుగానే ఈ కేసులో అమర్ దీప్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు చెప్పారు.
పెట్టుబడులు...
పోలీసుల కథనం ప్రకారం.. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ పథకాలు ప్రారంభించి పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బహుళజాతి సంస్థల్లో పెట్టుబడులు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. సురక్షితమైనవి, టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులుగా ప్రచారం చేసిన ఈ పథకాలు చివరకు మోసంగా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. స్కాం వెలుగులోకి రాగానే అమర్దీప్ దంపతులు దుబాయ్‌కు పరారయ్యారు. ఇంతకుముందే ఈ కేసులో కంపెనీ సీఈఓను, అమర్దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.విచారణ కోసం అమర్‌దీప్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చే అవకాశముందని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.
Next Story

