Fri Dec 05 2025 07:59:06 GMT+0000 (Coordinated Universal Time)
Modi touching feet of a girl:ఆ పని నచ్చదంటూ.. వెంటనే అమ్మాయి కాళ్లు మొక్కిన ప్రధాని
శుక్రవారం భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్‌లో పాల్గొన్నారు

Modi touching feet of a girl:శుక్రవారం భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్‌లో పాల్గొన్నారు. పలువురు క్రియేటర్స్ కు ప్రధాని మోదీ అవార్డులను ఇచ్చారు. ఆయన నుండి అవార్డులను అందుకున్న వారిలో జాన్వీ సింగ్ కూడా ఉన్నారు. సాధారణంగా భారత సంస్కృతిలో భాగంగా పెద్దలకు కాళ్లు మొక్కడం సహజమే. అలాగే జాన్వీ సింగ్ కూడా గౌరవ సూచకంగా ప్రధాని పాదాలను తాకింది. అయితే వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి జాన్వీ సింగ్ పాదాలకు నమస్కరించేసారు. హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ విభాగంలో జాన్వీ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. ఎవరైనా తన కాళ్లు మొక్కితే.. తనకు ఏదోలా ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పని తనకు అసలు నచ్చదని అన్నారు. మోదీ అమ్మాయి కాళ్లకు తిరిగి మొక్కిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది.
ప్రధానమంత్రి నుండి అవార్డును స్వీకరించిన జాన్వీ సింగ్ మాట్లాడుతూ.. “భారతదేశం చాలా అందమైన దేశం, మన దేశ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన ప్రతిదీ అందంగా ఉంటుంది. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం.. చీరల వంటి ఫ్యాషన్ ద్వారా భారతదేశ మూలాలను గుర్తుంచుకునేలా చేయడమే నా ఏకైక ప్రయత్నం." అని అన్నారు.
Next Story

