Sat Mar 07 2026 19:19:15 GMT+0530 (India Standard Time)
Bhajanlal Sharma : ఆర్టీసీ బస్సులో రాజస్థాన్ ముఖ్యమంత్రి
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఒక ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఒక ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఆయన ముఖ్యమంత్రి కాక ముందు ఆర్టీసీ బస్సులో సామాన్యుడిగా ప్రయాణిస్తున్న ఫొటోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
చాలా రోజుల క్రితం...
సామాన్య వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి స్థాయి పదవికి చేరుకున్నాడన్న దానికి ఉదాహరణగా భజన్ లాల్ శర్మ ఫొటోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మెడలో కాషాయకండువా వేసుకని బస్సులో ఫుట్ బోర్డుమీద ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి నేడు అసాధారణమైన భద్రత నడుమ కాన్వాయ్ లో ప్రయాణించడం కాల మహిమ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ఫొటోలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
Next Story

