Thu Mar 19 2026 09:43:59 GMT+0530 (India Standard Time)
LPG Gas : ఎల్.పి.జి గ్యాస్ ఏటీఎంలు... తెలుగు రాష్ట్రాల్లో త్వరలో
పెట్రోలియం శాఖ భారత్ లో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల ఏటీఎంలను ప్రారంభించింది

మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఎల్.పి.జి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వినూత్నమైన 'LPG గ్యాస్ ఏటీఎం'లను ప్రవేశపెట్టింది. ఈ ఏటీఎంలు 24x7 పనిచేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసేలా చర్యలు చేపట్టింది.
రెండు మూడు నిమిషాల్లోనే...
కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో డిజిటల్, కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో సిలిండర్‌ను అందిస్తాయి. 2025లో బెంగళూరు, గురుగ్రామ్‌లలో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, జైపూర్ వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయి. ఈ సౌకర్యం భారత్ గ్యాస్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Next Story

