Sat Mar 07 2026 17:44:40 GMT+0530 (India Standard Time)
ఈరోజు కూడా పెరిగిన పెట్రోలు ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు వరసగా ఎనిమిదో సారి పెట్రోలు ధరలను పెంచాయి

పెట్రోలు, డీజిల్ ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు వరసగా ఎనిమిదో సారి పెట్రోలు ధరలను పెంచాయి. ఈరోజు పెట్రోల్ లీటుపై ఎనభై పైసలు, డీజిల్ పై 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో డీజిల్ ధర కూడా అనేక రాష్ట్రాల్లో సెంచరీ దాటేసింది.
ఎనిమిది విడతలుగా....
గత ఎనిమిది విడతలుగా పెంచిన ధరలతో వినియోగదారులపై భారం పడింది. ఎనిమిది సార్లు పెట్రోలు లీటరుపై 5.60 రూపాయలు పెరిగింది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం కారణంగానే ధరలు పెంచాల్సి వచ్చిందని చమురుసంస్థలు వివరణ ఇచ్చుకుంటున్నాయి.
Next Story

